Monday, September 9, 2013

దారి తప్పిన ప్రార్థనకు 
పూజారిని కాలేను 

కష్టపడే పూజకు 
భక్తుడిని కాలేను 

ఇష్టపడే భక్తుడికి 
దైవాన్ని కాలేను 

కరుణించలేని  దైవానికి 
మనిషిగా  కనబడలేను 

మనసులేని మనిషికి 
జీవితాన్ని అందివ్వలేను 

Tuesday, March 5, 2013

ఏడవకు ఏడవకు 
నా చిట్టి తల్లీ ! 
ఇకపై 
నీ ఏడిచే రోజులన్నీ 
ఎదిరించే రోజులుగా మార్చుకో 
ఓ బంగారు చెల్లీ ! 

Thursday, February 28, 2013

అబద్ధాల బంధాలతో 
నిత్యం మనసు 
ముక్కలవుతునే ఉంది 
అది చాలక 
మనిషిని కూడా 
ముక్కలు చేస్తున్నావా స్వామీ?
అందరు పోతే 
నిన్ను పూజించే వారు ఎవరుంటారు?
అందుకే నన్నుంచు.. 

బేలతనం 
ఆకాశమంత మనసు తనం 
భూదేవంత స్వచ్చందం 
ఆ నవ్వుల్లో ఏ  మంటలు లేవు 
ఆనందపు అంచులు తప్ప!
నడుమ ఉన్న ఆ మంట 
తమనేమి చేయగలదనే నిశ్చింత 
చింతలేని ఆ చిన్నతనం చూసి 
చిన్నబోయింది కదా 
ఆ మంటల రోషమంతా !

Saturday, October 20, 2012

ఎండిన కొమ్మకు గ్రీష్మంలో 
ఎండ అంటుక్కున్నట్లుంది దారిద్ర్యం 
పాట మధ్యలో 
గొంతు నొక్కినట్లుంది ఆకలి
దారిన పోయే వ్యక్తి 
విసుగుతో విసిరేసిన జీవితం నాది 
గెలిచినా, ఓడినా మిగిలిన 
క్షణాలు కొన్నే...
అవి నీ గుప్పిట బంధించిన 
హస్తరేఖలే అన్నీ.

Saturday, March 17, 2012

స్మ్రుతి బింబాలు 
నిత్యం జ్ఞప్తికి వస్తున్నా 
ఈనాటి వరకు నా ముఖం నిజ వర్ణం ఎరుగదు 
నా మస్తిష్కం నిశ్సబ్దం ఎరుగదు 
ఎంత రాసినా 
కాగితంపై ఒకవైపు 
రోజువారీ అవసరాల పట్టీ
ఏరోజుకారోజు 
జీవితం మూడు గీతాల్లోని బొమ్మ!